అనకాపల్లిలో నేషనల్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం
AKP: ఈనెల 1వ తేదీ నుంచి 31వరకు నేషనల్ రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకటనారాయణ తెలిపారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సీఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటో డ్రైవర్స్ పాల్గొన్నారు.