ఈదురు గాలులు.. అరటి తోటలకు తీవ్ర నష్టం

ఈదురు గాలులు.. అరటి తోటలకు తీవ్ర నష్టం

నంద్యాల జిల్లా మహానంది మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం భారీ గాలులు వీచాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె ప్రాంతాల్లో సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరిగాయి. సుమారు 100 ఎకరాల్లో నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అకాల వర్షంతో మొక్కజొన్న పంట కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.