'పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

KMM: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. శుక్రవారం సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని, కమిషనర్ నరసింహతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.