VIDEO: పెంచలయ్య హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన
SKLM: నెల్లూరులో గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న CPM కార్యకర్త పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఆదివారం రణస్థలంలో కొవ్వోత్తులు ప్రదర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు CITU జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు మాట్లాడుతూ.. గంజాయి ముఠాను ఎదుర్కొనే క్రమంలోనే పెంచలయ్య హత్యకు గురయ్యారని అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.