శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

TPT: బెంగళూరుకు చెందిన భక్తుడు కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం అందించారు. బుధవారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ఆయన క్యాంపు కార్యాలయంలో విరాళం చెక్కును భక్తుడు స్వయంగా అందజేశారు. దాతకు టీటీడీ అదనపు ఈవో అభినందనలు తెలిపారు.