రాష్ట్రంలోనే మొదటి స్థానం

రాష్ట్రంలోనే మొదటి స్థానం

NRML: మామడ మండలం కొరటికల్‌కు చెందిన రైతు బిడ్డ దోడ వినీష ఇంటరు మొదటి సంవత్సరంలో 470 మార్కులకు ఏకంగా 469 సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంతో నిలిచింది. ఆమె పదో తరగతి వరకు ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్‌ను నిర్మల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదివింది. మార్కుల పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను అభినందించారు.