లంకెల కూరపాడులో పాస్ పుస్తకాల పంపిణీ
PLD: ముప్పాళ్ళ మండల పరిధిలో రీ సర్వే పూర్తి కావడం జరిగిందని మండల తహసీల్దార్ నగేష్ గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లంకల కూరపాడులో 759 అలానే దేచవరపాడు గ్రామంలో 238 పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. సహకరించిన రైతులకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.