VIDEO: 'స్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలి'
నిర్మల్ పట్టణం మంచిర్యాల చౌరస్తాలో ఉన్న హిందూ స్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని మాజీ కౌన్సిలర్ రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలువురు నాయకులతో స్మశానవాటికను సందర్శించారు. వారు మాట్లాడుతూ.. స్మశానవాటికలో అంతిమ సంస్కారాలకు వచ్చే వారికి తగిన సౌకర్యాలు కల్పించడానికి మున్సిపల్ ఛైర్మన్ చొరవ తీసుకోవాలని కోరారు.