రాజీమార్గమే రాజమార్గం: ఎస్సై

SRPT: రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని,లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చని, మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.