VIDEO: బాలానగర్ అండర్‌పాస్ పనుల్లో జాప్యం
MBNR: బాలానగర్ వద్ద 44వ జాతీయ రహదారిపై అండర్‌పాస్ బ్రిడ్జ్ పనులు గత 18 నెలలుగా జాప్యం జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లడం వల్ల పనులు నిలిచిపోయాయని ప్రాజెక్టు మేనేజర్ వెల్లడించారు. పనులను త్వరలోనే పూర్తి చేసి రాకపోకలకు వీలు కల్పిస్తామని తెలిపారు.