అకాల వర్షం ఎఫెక్ట్.. మార్కెట్ యార్డ్‌లో తడిసిన పసుపు
NZB: మార్కెట్ యార్డ్‌కు మొత్తంగా 16,900 క్వింటాళ్ల పసుపు వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన పసుపు కొమ్ములను దాదాపు 70 నుంచి 80 శాతం వరకు షెడ్లలో ఉంచుతున్నారు. అయితే ఎక్కువగా పసుపు యార్డ్‌కు రావడంతో మార్కెట్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ కొమ్ములను ఉంచారు. కాని అకాల వర్షానికి యార్డులోని ఖాళీ ప్రదేశాల్లో ఉంచిన పసుపు పూర్తిగా తడిసిపోయింది.