అదుపుతప్పి పాల కంటైనర్ బోల్తా

CTR: పూతలపట్టు మండలంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న తిరుమల డెయిరీ వద్ద వల్లభ డెయిరీకి సంబంధించిన పాల కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాన్ని తొలగించారు.