VIDEO: నసురుల్లాబాద్‌లో ఉద్రిక్తత... రోడ్డుపై బైఠాయింపు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి నిరసనగా బుధవారం ఉదయం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న సీఐ, పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. గ్రామంలో పోలీసుల పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది.