CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
E.G: కొవ్వూరు మండలానికి చెందిన 13 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 5,23,000 విలువైన చెక్కులను ఇవాళ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. అవసరమైన వారికి సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందజేసేలా కృషి చేస్తున్నామని, పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.