'యువత భగత్ సింగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి'

'యువత భగత్ సింగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి'

కృష్ణా: గుడివాడ సుందరయ్య భవన్‌లో స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల వర్ధంతి కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యసనాలకు బానిసలైన యువత భగత్ సింగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం నేత ఆర్ సీసీ రెడ్డి అన్నారు.