గ్యాస్ ఇక్కట్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్ LPG సిలిండర్ల కొరత ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాప్‌లను ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లించేందుకు విద్యుత్ యూనిట్‌కు రూ.2 రాయితీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన కమర్షియల్ ఎల్పీజీ వినియోగ పరిమితులు ఉన్నంత వరకు ఈ రాయితీ అమల్లో ఉండనుంది.