సోమ కుమారుడు సురేష్‌కు డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం
ASR: 2018లో నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ రెండవ కుమారుడు సివేరి సురేష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన హామీని మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకున్న చంద్రబాబు నాయుడుకు సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.