ఆర్థిక సహాయం అందించిన లోకేష్
GNTR: మంగళగిరి పట్టణంలోని హజరత్ అలీ పీర్లపంజాపై ఉర్దూ స్కూల్ రేకుల షేడ్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ రూ. 2 లక్షల 50 వేలు ఆర్థిక సహాయం చేశారు. కమిటీ సభ్యులు కోరగా వెంటనే స్పందించి, ఆ మొత్తాన్ని టీడీపీ నాయకులు శనివారం పీర్ల పంజా కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు షేక్ ఆదం షఫీ మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.