'స్వాతంత్య్ర దినోత్సవ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలి'

VZM: భారత స్వాతంత్య్ర దినోత్సవ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని విజయనగరం మున్సిపల్ కమిషనర్ పి. నల్లనయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రచార సామగ్రిని ఆయన ఆవిష్కరించారు. భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు లభించి ఆగస్టు15 నాటికి 78 సంవత్సరాలు పూర్తికావస్తుందని పేర్కొన్నారు.