మాజీ కార్పొరేటర్ తల్లి మృతి.. ఎమ్మెల్యే నివాళి
HNK: మాజీ కార్పొరేటర్ వీరగంటి రవీందర్ తల్లి తారాబాయి గత అర్ధరాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి తారాబాయి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతి తెలిపిన MLA...తారాబాయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.