మంత్రి లోకేష్‌తో పల్లె రఘునాథ్ రెడ్డి భేటీ
సత్యసాయి: మంత్రి నారా లోకేష్‌ను మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పుట్టపర్తి నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పల్లె.. వాటి పరిష్కారానికి సానుకూల స్పందన లభించిందని తెలిపారు.