ఏదుల రిజర్వాయర్‌పై ఎమ్మెల్యే విమర్శలు
WNP: వనపర్తి నియోజకవర్గంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం జరిగినా, ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని, ఆయకట్టు రైతులకు లాభం లేకపోయిందని, ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. ముందుగా దీనిపై సమాధానం చెప్పి, తర్వాతనే నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు వనపర్తికి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.