నాటు తుపాకీతో బాబాయ్‌ని చంపిన కొడుకు

VZM: ఎస్.కోట మండలం పల్లపు దుంగాడ గ్రామంలో బాబాయ్‌ని కొడుకు చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీదర రాము(బాబాయ్), అన్న కొడుకు సీదర నాగులుకు కొన్నేళ్లుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాగులు నాటు తుపాకీతో బాబాయ్‌ని కాల్చి చంపాడు. రాము కూతురు నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.