VIDEO: రోడ్డు ప్రమాదంలో మారేడుమిల్లి ఎంఈవో మృతి
ASR: రంపచోడవరం మండలం పాముగండి సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మారేడుమిల్లి, వై. రామవరం మండల ఎంఈవో తాతబ్బాయి దొర మృతి చెందారు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.