కొండాపూర్‌లో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
JGL: ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో సహస్ర అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కన్నతండ్రి, సవతి తల్లి కలిసి సహస్ర (15)ను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి జ్యోతి 2017లో మరణించిన తర్వాత రవి సవితను రెండో వివాహం చేసుకున్నాడు. తల్లి మరణం తర్వాత సహస్రను తండ్రి, సవతి తల్లి వేధించారన్నారు.