సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, రవీందర్, ప్రవీణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.