గాజువాకలో యువకుడు ఆత్మహత్య

VSP: కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పరిధి వికాస్ నగర్‌లో నివాసం ఉండే సాయిరాం(20) ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న న్యూపోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.