21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

TPT: తిరుపతి కరకంబాడి రోడ్డులోని టీఎన్ పాలెం అటవీ ప్రాంతంలో మూడు కార్లల్లో లోడ్ చేస్తున్న ఎర్రచందనం చెట్ల వేర్లతో సహా 21 దుంగలను పట్టుకుని ఒక స్మగ్లర్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మామండూరు నుంచి కరకంబాడి వైపుగా కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ కొందరు ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.