నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 654 JNVల్లో 6వతరగతి సీట్ల భర్తీకి 2 విడతల్లో ఎంపిక పరీక్షను నిర్వహించనున్నారు. పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, జమ్మూకశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న పరీక్ష జరగనుంది. దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.