నేడు జగ్గన్న తోట ప్రభల తీర్థం పై సమావేశం
కోనసీమ: అంబాజీపేట మండలం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జగ్గన్న తోట ప్రభల తీర్థం రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించనుంది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ఆర్డీవో శ్రీకర్ ఆద్వర్యంలో నేడు మొసలపల్లి లో ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ తీర్థానికి లక్షలాదిమంది తరలివస్తారు. తీర్ధం ఏర్పాట్లపై చర్చించనున్నారు.