పేకాట స్థావరంపై పోలీసుల దాడి
PLD: నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్ల గ్రామం NSP కాలువ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.21,000 నగదు, మూడు బైకులు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.