మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
GDWL: మానవపాడు మండల పరిధిలోని కలుకుంట్ల గ్రామంలోని రైతు వేదికలో శనివారం నూతన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ.. మొక్కజొన్న పంట పండించిన రైతుల నుంచి ప్రతి గింజలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యాన్ని ఆరబెట్టుకుని ప్రభుత్వ సూచనల మేరకు మొక్కజొన్నను తీసుకురావాలని తెలిపారు.