భారత్ నోటమ్ జారీ.. ఆందోళనలో పాక్

భారత్ నోటమ్ జారీ.. ఆందోళనలో పాక్

వాయుసేన విన్యాసాలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో భారత వాయుసేన విన్యాసాల కోసం ఈ నెల 5 నుంచి 12 వరకు గగనతలాన్ని రిజర్వ్ చేస్తూ భారత్ నోటమ్ జారీ చేసింది. అఫ్గాన్‌తో యుద్ధం చేస్తున్న పాకిస్థాన్ ఈ నోటీసుతో ఆందోళనకు గురైంది. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని తాజాగా పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పడం గమనార్హం.