రైలు కింద పడి వ్యక్తి మృతి
KMR: కామారెడ్డి ఆర్బోనగర్ రైల్వే కమాన్ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చని, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ మేరకు మృతుడిని గుర్తించినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.