ప్రతి ఒక్కరు ఓటు హక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలి

విశాఖ: అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలని చింతపల్లి తహసీల్దార్ టి. రామకృష్ణ అన్నారు. మండలంలో డీగ్రి కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి గురువారం ఓటర్ల చైతన్యం కోసం అవగాహన ర్యాలీ, అక్షరాలతో కుడిన మానవహారాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవలన్నారు.