కూకట్‌పల్లి ‘Y’ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్
HYD: అత్యంత రద్దీగా ఉండే NH-65 హైవేపై కూకట్‌పల్లి 'Y' జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. H-City ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ రెండు భారీ ఫ్లైఓవర్ల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఒకటి మియాపూర్ వైపునకు, మరొకటి అమీర్‌పేట వైపునకు మూడు లైన్ల చొప్పున నిర్మించనున్నారు.