గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన పాయం
BDK: అశ్వాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఇవాళ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.