నీలగిరి చెట్లకు దుండగులు నిప్పు
BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని నీలగిరి చెట్ల సమీపంలో దుండగులు నిప్పు పెట్టడంతో కార్చిచ్చు అంటుకుంది. దీంతో జాతీయ రహదారిపై పొగ వ్యాపించి రాకపోకలు సాగించేవారు భయాందోళనకు గురయ్యారు. కార్చిచ్చుతో నీలగిరి చెట్ల కిందభాగం పూర్తిగా కాలి బూడిదైంది. వేసవి కావడంతో మంటలు చెలరేగినా, అటవీశాఖ అధికారులు, సిబ్బంది అటువైపు చూడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.