'ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి'

ASF: స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని గోలేటి సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవితేజ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోలేటిలోని సింగరేణి పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.