మిస్ ఏలూరుగా దివ్య
ఏలూరు నగరంలో 'క్రౌన్ ఆఫ్ ఏలూరు' అందాల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో ఆలపాటి దివ్య తన అద్భుత ప్రదర్శనతో మిస్ ఏలూరు కిరీటాన్ని దక్కించుకున్నారు. దర్శకులు సతీస్ అడ్డాల, కోడైరెక్టర్ ప్రియా ఎండానా, ఇతర సినీ ప్రముఖులు దివ్యకు 'మిస్ ఏలూరు' ట్రోఫీని, కిరీటాన్ని అందజేశారు.