తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుంది: ఎంఈవో

KMM: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని మధిర మండల విద్యాశాఖ అధికారి డేవిడ్ రాజు అన్నారు. శుక్రవారం మధిర మండలం రాయపట్నం ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు దాతలు రజిని, రామానంద్ ఏర్పాటు చేసిన రూ.60 వేలు విలువ గల నోట్ బుక్స్, పరీక్ష సామాగ్రిని ఎంఈవో పంపిణీ చేశారు. విద్యార్థులందరూ చదువులో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.