కశింకోటలో ఎన్రోల్మెంట్ డ్రైవ్

కశింకోటలో ఎన్రోల్మెంట్ డ్రైవ్

AKP: కశింకోట సత్తమ్మ కాలనీలో శుక్రవారం స్కూల్ అసిస్టెంట్ ఆచంట రవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. ఉచిత విద్య, మధ్యాహ్నం భోజన పథకం, వసతి తదితర సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటాయన్నారు.