ఈనెల 25న క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు
PDPL: కమాన్ పూర్ మండల కేంద్రంలోని ZPHSలో ఈనెల 25న క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో విజయకుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి ప్రవేశార్థం 3వ తరగతి పూర్తి చేసిన 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ మేరకు స్టడీ సర్టిఫికెట్, ఆధార్, ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు.