ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
యూపీ హత్రాస్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు.. ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.