భీమన్న ఆలయ సమీపంలో చిరుత సంచారం
ASF: కాగజ్ నగర్ మండలంలోని కడంబా-డబ్బా మార్గంలో భీమన్న ఆలయ సమీపంలో పలువురు అయ్యప్ప స్వాములకు చిరుతపులి కనిపించింది. బెజ్జూరు మండలంలో పడి పూజ కోసం వెళ్లి వస్తుండగా ఆలయం ఎదురుగా రోడ్డుపై చిరుత ఎదురైంది. భక్తులు వాహనాన్ని నిలిపి చూడగానే రోడ్డు దాటుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందన్నారు. చిరుత సంచరిస్తున్న విషయం వాస్తవమేనని అధికారులు పేర్కొన్నారు.