తిరుపతి ప్రజలకు కమిషనర్ గమనిక

TPT: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.