ఇచ్చిన మాటను నిలబెటుకున్న ఎమ్మెల్యే
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. ఆరు నెలల క్రితం పాత జైలు రోడ్డులో ఫుడ్ కోర్ట్ తొలగించిన సమయంలో, బాధితులకు మళ్ళీ ఏర్పాటు చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆయన రూ.6 కోట్లతో ఫుడ్ కోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.