తీర్థ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: వేపాడ మండలం ముకుందపురం గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ వెంకట జగన్నాథస్వామి తీర్థ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాముల వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆనంతరం క్రికెట్ పోటీలలో గెలుపొందిన ప్రతిభావంతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు.