'మేడే ను విజయవంతం చేయాలి'
SRCL: బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో గురువారం హమాలి కార్మికులతో కలిసి మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా మే డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మే డేను విజయవంతం చేయాలని CITU జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ అన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు.