పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్
SS: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యర్థాలను పునర్వినియోగం చేసేలా ఆధునిక సాంకేతికతను వాడాలని సూచించారు. రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉన్నవారు తమ ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు.